Breaking News

స్మశానానికి వెళ్ళే దారిలో ఆక్రమణలను తొలగించాలని ఎమ్మార్వో కి వినతి.

0 21

 అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు: ఎన్నో ఏళ్లుగా శ్మశానానికి వెళ్లేందుకు ఉపయోగించుకుంటున్న రహదారిని ఆక్రమించుకొన్నవారిని వెంటనే తొలగించాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పాత బాలారం గ్రామంలో గ్రామస్తులు వినియోగించుకొంటున్న శ్మశానపు దారిని, గ్రామానికి చెందిన బండారు నూకినాయుడు అనే వ్యక్తి నాది అంటూ కంచె నిర్మించాడన్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వెంటనే తొలగించాలని తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు.


ఎక్స్ సర్పంచ్ బంటు నూకరత్నం,వార్డు మెంబర్ బోడక నాగమ్మ,
 శ్రీను,రాజు, రవికుమార్,నానాజీ,చిట్టిబాబు ,తమ్మిరాజు పాల్గొన్నారు.
Leave A Reply

Your email address will not be published.