Breaking News

టైరు పంక్చర్ అయి చిన్నగడ్డ గ్రామంలో ఆగిపోయిన పాడేరు డిపో ఆర్టీసీ బస్సు

0 20

 చిన్నగడ్డ సమీపము వద్ద టైరు పంక్చర్ అయి ఆగిపోయిన పాడేరు డిపో బస్సు.

అల్లూరి సీతారామరాజు జిల్లా:

పాడేరు ఆర్టీసీ డిపో బస్సు బాకూరు నుండి చింతపల్లి వెళుతూ చిన్నగడ్డ గ్రామం దగ్గరలో మధ్యాహ్నం 12 గంటలకు బస్సు ముందు టైరు పంక్చర్ అయి ఆగిపోయింది. దీంతో సకాలంలో గమ్యాన్ని చేరుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకు టైరు పంక్చర్ అయితే సాయంత్రం నాలుగున్నర గంటల వరకు బస్సు అక్కడే ఉంది. వేరే టైరు మార్చేందుకు సరిపడా టూల్ కిట్ బస్సులో లేనందున బస్సు డ్రైవరు, కండక్టర్ తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాడేరు డిపోకు చెందిన బస్సులు కండిషన్ లో కూడా ఉండటం లేదని ప్రయాణికుల నుండి ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రయాణికులు అంటున్నట్లు బస్సులు కండిషన్ లో లేకపోతే డిపోలో పనిచేసే మెకానికల్ ఇంజనీర్ ఏం చేస్తున్నట్టు? ఫుల్ టూల్ కిట్ బస్సులో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం అధికారులకు లేదా? ప్రయాణికులు ఆరోపిస్తున్నట్లు బస్సులు ఎందుకు కండిషన్లో ఉండటం లేదు, సరైన మెయింటెనెన్స్ ఎందుకు చేయడం లేదని కొంతమంది బస్సు డ్రైవర్లను అడగగా … ఇవి సిటీ బస్సులు అనుకుంటున్నారా, ఏజెన్సీ బస్సులు ఇలాగే ఉంటాయని వారి ఎంఎఫ్ అంటున్నారని సమాధానం చెప్పారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఘాటీ సర్వీస్ ఉంటుంది కనుక బస్సులు కండిషన్ లో ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులలో లేదా? అని ప్రయాణికులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.