Breaking News

జీ.కె వీధి లో బీజేపీ జెండా ఆవిష్కరణ. -పాల్గొన్న గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా

0 20

 జీ.కె వీధి లో బీజేపీ జెండా ఆవిష్కరణ.

-పాల్గొన్న గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా 


పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో బీజేపీ బలోపేతం కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతీ బూత్ లో ప్రచారం చేయాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.


గురువారం జీ.కె వీధి మండల బిజెపి కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు బోండ్ల చిరంజీవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కురుసా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గిరిజన ప్రాంతాల్లో రహదార్లు, త్రాగునీటి కోసం నిధులు ఇస్తున్నారు అని, గిరిజన ప్రాంతాల్లో జాతీయ రహదార్లు, ప్రతీ గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా కొలాయి కనెక్షన్లు ఇస్తున్నారు అని,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేంద్రం ద్వారానే పంచాయతీ నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించి అభివృద్ధి లేకుండా చేస్తున్న విషయం తెల్సిందే అని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ని గద్దె దించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుడా కృష్ణారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో బీజేపీ ని బలోపేతం చేయడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని,

ప్రతీ 5 బూత్ లకు ఒక శక్తి కేంద్రం ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేపట్టడానికి ప్రతీ పేద వారికి పధకాలను అందించేందుకు కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాటం కూడా ఖచ్చితంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల ఇంచార్జ్ సల్లా రామకృష్ణ, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి దుక్కేరి ప్రభాకర్,జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి శేఖర్ ,అచ్యుత్ మండల కార్యవర్గ సభ్యులు,తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.