Breaking News

అల్లూరి సీతారామరాజు స్మారక మందిరాన్ని సందర్శించిన లీడర్ పత్రిక ఎండీ రమణమూర్తి.

0 20

 అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట లోని అల్లూరి సీతారామరాజు స్మారక మందిరాన్ని సందర్శించిన లీడర్ పత్రిక ఎండీ రామణమూర్తి.

ముందుగా అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులు వద్ద పూలు పెట్టి నివాళులు అర్పించారు.

అనంతరం పార్కు లోని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో పార్కులో పని చేస్తున్న ముగ్గురికి 3 సంవత్సరాలుగా జీతాలు ఇవ్వడం లేదని వారు తెలిపారు.

ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు జీతాలు పడేలా మాట్లాడుతానని లీడర్ పత్రిక ఎండీ రమణమూర్తి ఆ ముగ్గురికి చెప్పారు.

అనంతరం ఆ ముగ్గురికి ఒకరికి ఒక బేగ్ చొప్పున ముగ్గురికి మూడు రైస్ బేగ్ లు, కొంత సొమ్మును ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో భారతీయ ఆదివాసుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గడుతూరి రాంగోపాల్, అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ నాగ సత్యనారాయణ, వివేకానంద సేవా సంఘం సభ్యుడు సూరాడ అప్పారావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.