Breaking News

బ్యాటరీ బైక్ తయారు చేసిన ఏఎల్ పురం యువకుడు.

0 21

 

రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ చార్జీలు దృష్టిలో ఉంచుకొని సృజనాత్మక మెలికలతో ఒక యువకుడు బ్యాటరీ బైక్ తయారు చేసాడు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం గ్రామానికి చెందిన గుణపర్తి రమేష్ అనే యువకుడు సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెట్టాడు.

పెరుగుతున్న పెట్రోల్ చార్జీల వలన ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంటుందని దీనికి అనుగుణంగా తన దగ్గర ఉన్న ద్విచక్ర వాహనానికి ఇంజన్ తొలగించి బ్యాటరీ మరియు మరికొన్ని పరికరాలు అమర్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా చార్జింగ్ బైక్ ను తయారు చేశాడు. బ్యాటరీ అమర్చిన ద్విచక్ర వాహనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అని తయారుచేసిన రమేష్ అనే యువకుడిని అడగగా బ్యాటరీ ఛార్జింగ్ పెడితే 150 నుండి 180 కిలోమీటర్లు నిర్వరామంగ నడుస్తుందని తెలిపాడు.ఈ వాహనం వలన ఎటువంటి కాలుష్యం లేకుండ పర్యావరణాననికి ఎటువంటి హాని కలగకుండా రక్షించుకోవచ్చు అని ఈ చార్జింగ్ బైక్ వలన ఎటువంటి అసౌకర్యం లేదని ఆ యువకుడు తెలిపాడు.

Leave A Reply

Your email address will not be published.