Breaking News

ప్రమాదవశాత్తు కాలు ఎముక విరిగిన గిరిజన మహిళకు దుక్కేరి పరామర్శ.

0 20

 ప్రమాదవశాత్తు కాలు ఎముక విరిగిన గిరిజన మహిళకు దుక్కేరి పరామర్శ.


ప్రమాదంలో కాలు ఎముక విరిగి విశాఖపట్నం KGH హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గిరిజన మహిళను పరామర్శించిన దుక్కేరి.ప్రభాకరరావు జై ఆదివాసీ జై భీమ్ అధ్యక్షుడు మరియు బీజేపీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి.

ప్రమాదవశాత్తు కాలు ఎముక విరిగిన అల్లూరి సీతారామరాజు జిల్లా, G.మాడుగుల మండలం,బొయితిలి గ్రామనికి చెందిన కాంతారి.సోములమ్మ W/O భీమ్ బాబు కుటుంబ సభ్యులకు ఈ నెల రెండవ తారీకు సాయంత్రం ప్రమాదం జరిగింది. ప్రస్తుతం పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో వున్నాము మమ్మల్ని విశాఖపట్నం KGH హాస్పిటల్ కి పంపిస్తున్నారు. మాకు సహాయం చేయండి అని తెలిపిన వెంటనే,అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఉన్న దుక్కేరి.ప్రభాకరరావు జై ఆదివాసీ జై భీమ్ అధ్యక్షుడు మరియు బీజేపీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంటనే కొన్ని గంటల వ్యవధిలో విశాఖపట్నం KGH హాస్పిటల్ కి చేరుకొని, KGH హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడి,చికిత్స తొందరగా జరగాలని కోరారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సోములమ్మ తొందరగా నయం అవుతుంది అని మేము మీకు అన్ని వేళలా తోడుగ ఉంటామని దైర్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.