Breaking News

అల్లూరి అనుచరులైన గంటందొర కుటుంబాలను కలిసిన లీడర్ పత్రిక ఎండీ రమణమూర్తి.

0 20

 అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట లోని అల్లూరి సీతారామరాజు స్మారక మందిరాన్ని సందర్శించి, అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని అల్లూరి అనుచరులైన గాం.గంటందొర,మల్లుదొర కుటుంబ సభ్యులను కలిసిన లీడర్ పత్రిక ఎండీ రమణమూర్తి.


అల్లూరి సీతారామరాజు, గంటందొర, మల్లుదొర గురించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

 స్వాతంత్ర్యం కోసం పోరాడి అసువులు బాసిన అల్లూరి అనుచరులైన గాం.గంటందొర మనుమడు దీన స్థితిని చూసి చలించిపోయారు.

స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా, ఇన్ని ప్రభుత్వాలు మారినా వీరిని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

గంటందొర మనుమడు బోడిదొర కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

బోడిదొర మనవరాలతో మాట్లాడుతూ ఎంతవరకు చదువుకున్నావ్ అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.

అయితే తాను డిగ్రీ వరకు చదివానని, ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇక చదవలేకపోయాను అని లీడర్ పత్రిక ఎండి రమణమూర్తి తో తెలిపారు.

 విషయం తెలుసుకున్న లీడర్ పత్రిక ఎండి ఏం చదవాలని అనుకుంటున్నావు అని ఆమెను అడగగా తాను లా చదవాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

అయితే నీకు చదివే ఆసక్తి ఉంటే నిన్ను నేను చదివిస్తాను అని లీడర్ పత్రిక ఎండి రమణమూర్తి హామీ ఇచ్చారు.

అనంతరం గంటందొర మనుమడు అయిన బోడిదొర కుటుంబ సభ్యులకు రైస్ బ్యాగులు,చీరలు, దుప్పట్లు,టవల్లు, సబ్బులు నిత్యావసర సరుకులు అందించారు.

ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి,భారతీయ ఆదివాసుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గడుతూరి రాంగోపాల్,ఆర్టీసీ ఎంప్లాయ్ నాగ సత్యనారాయణ, వివేకానంద సేవా సంఘం సభ్యుడు సూరాడ అప్పారావు, మరికొంత మంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.