Breaking News

మల్లవరం లో అల్లూరి జయంతి వేడుకలు.

0 18

 మల్లవరం లో అల్లూరి జయంతి వేడుకలు.



అల్లూరి సీతారామరాజు 125 వ జయంతిని పురస్కరించుకొని, అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, మల్లవరం గ్రామంలో అల్లూరి యువ గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు వచ్చిన వారికి సన్మానించి సీల్డ్ మరియు బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరి యువ గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు టి.మల్లేష్ మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు విద్యతోనే సాధ్యమని అన్నారు. పి.సన్యాసిరావు, చిట్టయ్య, రామరాజు, పి.లక్ష్మణరావు, పి.మల్లయ్య, ఎన్.చెల్లయ్య, పి.దాశరధి,రాంబాబు, రవికుమార్, చిరంజీవి, లక్ష్మణ్, రాజు, జంపా రాంబాబు మరియు గ్రామ పెద్దలు, పిల్లలు,యువత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.