Breaking News

కొయ్యూరు:నడింపాలెం లో అల్లూరి జయంతి ఉత్సవాలు.

0 29

 నడింపాలెం లో అల్లూరి జయంతి ఉత్సవాలు.


 ఈ రోజు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని, అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామంలో అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా పుంగనూరు నుండి శ్రీ రామచంద్ర యాదవ్ ( industrialist) వచ్చి నడింపాలెం జంక్షన్ లో గల అల్లూరి, గంటందొర,మల్లుదొర విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి నడయాడిన ప్రాంతంలో నిష్కల్మషమైన మనుషుల మధ్య నేను ఈరోజు గడపడం నాకు చాలా ఆనందంగా ఉందని,నేను చాలా అదృష్ట వంతుడనని కోలాటం వారికి, విద్యార్థులకు,యూనిఫాం ఇస్తానని,అలాగే ఇక్కడున్న ప్రతీ దేవాలయానికి నెలకు సరిపడే నూనె ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో రామాలయ నిర్మాణానికి తన వంతుగా యాబై వేల రూపాయలు కానుక ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైందవ సైన్యం చింతపల్లి మండల ఉపాధ్యక్షుడు సరమండ బాలకృష్ణ,దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మండల ఉపాధ్యక్షుడు తరమల కొండబాబు,సత్యవిద్యపీటం జిల్లా సమన్వయ కర్త డీవీడీ ప్రసాద్, స్థానిక మాజీ సర్పంచ్ సుమర్ల సాంబశివ,నడింపాలెం,శరభన్నపాలెం పాఠశాలల ఉపాధ్యాయ బృందం,బీజేపీ మండల అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు, మండల అధ్యక్షురాలు మంగతల్లి, స్థానిక పెద్దలు లోకుల గాంధీ గారి సోదరుడు కిరణ్ మాస్టారు,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.