Breaking News

గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని చెప్పులతో కొట్టుకుంటూ నిరసన.

0 42

 ఉపముఖ్యమంత్రి సొంత మండలంలోనే గిరిజన గ్రామాలకు రోడ్లు లేవని,చెప్పులతో కొట్టుకొని నిరసన తెలిపిన గిరిజనులు. 


దేవరాపల్లి మండలంలోని ఉపముఖ్యమంత్రి సొంత మండలం లోని పూలగరువు,కోడాపల్లి రామన్నపాలెం,కె.టి పాలెం, వాలాబు నుండి కోనాం వరకు తాటిపూడి, వీరబద్రపేట,నేరేళ్ళపూడి,బోడిగరువు గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు సౌకర్యం కల్పించాలని మంగళవారం గిరిజనులు MPDO కార్యాలయం ఎదుట ఈ ప్రభుత్వానకి ఓట్లువేసి తప్పు చేసామంటు చెప్పులతో కొట్టు కొని నిరసన తెలిపారు.

7/3/2022 న వాలాబు నుండి దేవరాపల్లి ఎం‌.పి.డి.ఓ కార్యాలయం వరకు 14 కిలోమీటర్లు దూరం మండు టెండను లెక్క చేయకుండా పాదయాత్ర నిర్వహించి దేవరాపల్లి ఎంపిడిఓ కి వినతిపత్రం సమర్పిచి తమగోడు వెల్లబుచ్చుకున్నామని అయిన ప్రభుత్వానికి కనికరం లేదని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో, ఉన్న కాలిబాటలు కూడ పూర్తిగా పాడైపోయాయని తెలిపారు.  రాజకీయాలుకు అతీతంగా గిరిజన గ్రామాలను వెంటనే అబివృద్ది చేయాలని వారు డిమాండ్ చేసారు.

 ఈకార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న, మండల కార్యదర్శి బి.టి.దొర మద్దతు పలికారు.

ఈకార్యక్రమంలో కాశి,సన్యాసి,బి. గణేష్,కె.రాము,డి.శంకర్,జె ఈశ్వరావు,కె.అప్పన్న,బి.నాగేశ్వరరావు,సిహెచ్ చినదేముడు,కె. ఈశ్వరావు, సిహెచ్ లక్ష్మణ్,బి దేముడు,డి.సోమయ్య,ఇరట గోపాలుడు ఇ.ఈశ్వరావు తో పాటు అధికసంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.