ఆర్.కొత్తూరు పరిధిలో కోడిపందాల శిబిరం పై దాడులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని ఆర్. కొత్తూరు పంచాయతీ పరిధిలో కోడిపందాలు ఆడుతున్న ముగ్గురుని,తమ సిబ్బందితో కలిసి పట్టుకొని అదుపులోకి తీసుకున్నామని సిఐ స్వామి నాయుడు,కొయ్యూరు ఎస్సై దాసరి నాగేంద్ర తెలిపారు.
వారి వద్ద నుండి నాలుగు కోడిపుంజులను,350 రూపాయలు నగదును కూడా పట్టుకుని సీజ్ చేసామని తెలిపారు.
వీరిపై కేసు కూడా నమోదు చేసినట్లు సీఐ,ఎస్ఐ తెలిపారు.