Breaking News

చింతపల్లి: కరాటే ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు కి గిరి జాగృతి అసోసియేషన్ అధ్యక్షులు సన్మానం.

0 19

 అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి: కరాటే ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు కి గిరి జాగృతి అసోసియేషన్ అధ్యక్షులు సన్మానం.


గిరి జాగృతి అసోసియేషన్ అధ్యక్షులు మోరి సింహాచలం వైటిసి చింతపల్లి కేంద్రంగా…

 15 సంవత్సరాల నుండి విశాఖపట్నం జిల్లా మన్యం 11 మండలాల విద్యార్థిని,విద్యార్థులకు కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ ద్వారా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇస్తూ కరాటే అసోసియేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి కరాటే మాస్టర్ బాకూరు పాండురాజు కి శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో గిరి జాగృతి అసోసియేషన్ అధ్యక్షులు సింహాచలం,జీకే వీధి తహసిల్దార్ రాజకుమార్, జీకే వీధి ఆర్ఐ సత్యనారాయణ, దుక్కేరి ప్రభాకర్ రావు మొదలైన వారు పాల్గొన్నారు.

గిరి జాగృతి అసోసియేషన్ ప్రెసిడెంట్ మోరి సింహాచలంకి, టీం సభ్యులకు కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ కరాటే ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.