Breaking News

గంటందొర మనుమడు బోడిదొర తో ముఖాముఖి||తన కూతురు కూలీ పనులకు వెళ్లి తనను పోషిస్తుందని ఆవేదన వ్యక్తం.

0 21

గంటందొర మనుమడు బోడిదొర తో ముఖాముఖి||తన కూతురు కూలీ పనులకు వెళ్లి తనను పోషిస్తుందని ఆవేదన వ్యక్తం.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంలోని బట్టపనుకుల పంచాయతీ, లంక వీధిలో ఈరోజు AG NEWS 24×7 యాజమాన్యం ముఖాముఖి కలిసి మాట్లాడటం జరిగింది.

అల్లూరి సీతారామరాజు తో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అసువులు బాసిన గాం.గంటందొర,మల్లుదొర మనవడు అయిన బోడిదొర తో కలిసి మాట్లాడటం జరిగింది.

అయితే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న వేదిక వద్ద బోడి దొరకు ప్రధాన మంత్రి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది.

అక్కడ జరిగిన విషయాలు అడిగి తెలుసుకునేందుకు బోడి దొర ను కలవడం జరిగింది.

అక్కడ జరిగిన విషయాలు తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు ఇద్దరు పిల్లలని, ఇద్దరిలో పెద్దవాడైన త్రిమూర్తి మరణించాడని, తన రెండవ కుమార్తె అయిన మల్లీశ్వరి తనను కూలి పనికి వెళ్తూ పోషిస్తుందని భావోద్వేగానికి గురయ్యారు.

అధికారులు స్పందించి వారు ఉండటానికి ఇల్లులు మంజూరు చేయాలని కోరారు.


Leave A Reply

Your email address will not be published.