హెచ్ ఆర్ పి సి ఐ జిల్లా వర్కింగ్ కమిటీ చైర్మన్ గా ఉదయకుమార్!
విశాఖపట్నం:
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా వర్కింగ్ కమిటీ చైర్మన్ గా విశాఖ సుజాతనగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వడ్డాదిఉదయకుమార్ ను నియమిస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ టి ప్రసన్నకుమార్ నియామక ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా ఉదయ కుమార్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతనుచిత్తశుద్ధితో నిర్వహిస్తానని, అలాగే మానవ హక్కుల ఉల్లంఘన జరిగి ఎవరైనా ఇబ్బందులుపడితే వారికి పూర్తి సహాయసహకారాలు అందించి వారిసమస్యలు పరిష్కరించడానికి కృషిచేస్తానని పేర్కొన్నారు.తనకు ఈనియామకం రావడానికి కృషిచేసిన భమిడిపాటి సాయికృష్ణకు,నేషనల్ చైర్మన్ ప్రసన్నకుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.