ఉజ్వల సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం.గిరిజన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి:బాకా లవకుశ.
ఉజ్వల సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం.గిరిజన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి:బాకా లవకుశ.
అరకు: కీ.శే. బాక శంకరరావు జ్ఞాపకార్థం ఈనెల 16న
నిర్వహించినున్న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి సంబంధించి కరపత్రాన్ని మంగళవారం అరకులోని సంస్థ కార్యాలయంలో నిర్వాహకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉజ్వల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బాక లవకుశ మాట్లాడుతూ
అరకువేలి మండలం,లోతేరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈనెల 16న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు.
రొమ్ములో గడ్డలు, థైరాయిడ్ గ్రంధి వాపులు,నోటిలో పుండ్లు, గొంతు నొప్పి, ఆడవారిలో అధిక రక్తస్రావం, చర్మం మీద పుండ్లు రావడం, చాతి నొప్పి, ఆగని దగ్గు, దీర్ఘకాలంగా మారిన గొంతు, ఆకలి లేకపోవడం,తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటి పలు లక్షణాలు కలిగిన వారు
ఈ శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలాగే తమ వద్ద ఉన్న పాత వైద్య పరీక్షల రిపోర్టులను కూడా తీసుకురావాలని చెప్పారు.
ఇతర వివరాలకు 70935 72864 అనే ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.
అరకు సిఐ జి.డి.బాబు మాట్లాడుతూ
ప్రజల కోసం ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉజ్వల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బాక లవకుశను ఆయన అభినందించారు.
ఏజెన్సీ ప్రాంతంలో కొన్నాళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతో మందికి అండగా ఈ సంస్థ నిలిచిందని కొనియాడారు.
ఈనెల 16న నిర్వహించే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని స్థానికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బాక లైకోన్ , గుబ్బాయి శ్రీరాములు, మాదల శ్రీరాము, రాముూర్తి తదితరులు పాల్గొన్నారు.