Breaking News

2.15 కోట్ల వ్యయంతో ఆర్ & బి రోడ్డు ను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0 20

 🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని ధనలక్ష్మిపురం జంక్షన్ నుండి కలివెలపాలెం, పెనుబర్తి వరకు రూ2.15 కోట్ల వ్యయంతో ఆర్ & బి రోడ్డు ను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర్ మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.  



🔹 ఇటీవల కురిసిన భారీవర్షాలకు అద్వాన్నంగా మారిన రోడ్లకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించి, రోడ్లు భవనాలశాఖ, పంచాయతీశాఖ రోడ్లకు 62 కోట్ల రూపాయల నిధులు మంజూరుచేసారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 🔹గడపగడపకు యాత్రలో కలివేలపాలెం గ్రామంలోనికి వచ్చినప్పుడు స్థానిక ప్రజలు నాయకులు స్మశాన వాటిక విషయం నా దృష్టికి తీసుకు రావడం జరిగింది దానికి సంబంధించి చుట్టూ ప్రహరీ గోడ కూడా వీలైనంత త్వరలో శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  

🔹 ప్రతికూల పరిస్థితులలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రోడ్ల కోసం నిధులు కేటాయించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి రూరల్ నియోజకవర్గ ప్రజలతరఫున ప్రత్యేక కృతజ్ఞలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ యాదవ్, జడ్పి కోఆప్షన్ సభ్యులు అల్లాబక్షు, కలివల పాలెం, పెనుబర్తి, కాకుపల్లి, సర్పంచులు మరియు ఎంపీటీసీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, వైసీపీ సీనియర్ నాయకులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.