Breaking News

బూత్ లెవెల్ నుండి టీడీపీ ని మరింత బలపరుద్దాం-అబ్దుల్ అజీజ్

0 21

 *బూత్ లెవెల్ నుండి టీడీపీ ని మరింత బలపరుద్దాం..

*నెల్లూరు రూరల్ లో పసుపు జెండా ఎగరవేయడమే మన లక్ష్యం…

*వైసీపీ పాలనలో ప్రజలు అన్యాయం అయిపోయారు..పేదలు నిరుపేదలుగా మారారు..

*వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది లా అండ్ ఆర్డర్ సంరక్షణ శూన్యంగా మారింది…

*వైసిపి అరాచకాలకు సరైన గుణపాఠం నేర్పుదాం…

*ప్రజలకు కిరీటం పెట్టినట్లు వారిపై చెత్త పన్ను భారాన్ని మోపుతున్నారు..

*బాదుడే బాదుడు ను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాం…

* అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి…


నెల్లూరు రూరల్, 28 వ డివిజన్, చైతన్య పురి కాలనీ లోని మాజీ కార్పొరేటర్ దొడ్డపనెని రాజా నాయుడు నివాసంలో బుధవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్ టీడీపీ 5, 6, 9 క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు….

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు.. 


నెల్లూరు రూరల్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు చరమగీతం పడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికి వెళ్లి టిడిపి నేతలు కార్యకర్తలు వివరించి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు…

ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి నెల్లూరు రూరల్ లో పసుపు జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలన్నారు…

వైసిపి పాలనలో ప్రజలు అన్యాయం అయిపోతున్నారనీ, పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారని తెలిపారు..

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని, కార్మికుల ఆర్తనాదాలను, రైతుల, చిరు వ్యాపారస్తుల ఆత్మహత్యలను దళితుల పై అత్యాచారాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు..

ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సంరక్షణ శూన్యంగా మారిందని, పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఎద్దేవా చేశారు…

వ్యక్తిగత పౌరుషం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆ కాకి దుస్తులకు న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారని పోలీసుల తీరు పై మండిపడ్డారు..

వైసిపి పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వైసిపి ప్రభుత్వ పాలన తీరు ఉందని తెలిపారు…

600 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం అభివృద్ధి చేశామని, 700 కిలోమీటర్లు మేర పైప్ లైన్లు వేశామని, మిగిలిన పది శాతం పూర్తి చేయలేని దుస్థితి లో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు..

ప్రజలకు కిరీటం పెట్టినట్లు అందరి పై చెత్త పన్ను భారాన్ని మోపారని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల బాధలు సమస్యలు తెలుసుకోని పరిష్కరించాల్సిన బాధ్యత తన పై ఉందని తెలిపారు..

బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియ గా కొనసాగించాలని నిర్ణయించామని, అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని తెలిపారు…

టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజల్లోనే ఉంటారని ప్రజా సమస్యలపై పోరాడుతారని ప్రజలతో మమేకమవుతారని తెలిపారు…

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ క్లస్టర్ 6 ఇంఛార్జి దొడ్డపనేనీ రాజా నాయుడు, మాజీ కార్పొరేటర్ క్లస్టర్ 9 ఇంఛార్జి మన్నెం పెంచలనాయుడు, నెల్లూరు పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి క్లస్టర్ 6 ఇంఛార్జి ఊరందరూ సురేంద్రబాబు, మాజీ కార్పొరేటర్ క్లస్టర్ 7 ఇంఛార్జి మేకల నరేంద్ర రెడ్డి, 3 క్లస్టర్ ల యూనిట్ ఇంఛార్జిలు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.