గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయి మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న వైసిపి మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి.
గురుపౌర్ణమి సందర్బంగా పాత గోపాలపట్నం లో శ్రీ షిరిడి సాయి మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి.
ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం,91వ వార్డు పాత గోపాలపట్నం లో శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి సాయిబాబా ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు జి.అప్పలస్వామి నాయుడు, పొట్నూరి శంకర్రావు, గొంతేన నాగరాజు, బోయిదాపు ప్రసాదు, గాంధీ, బొడ్డేపల్లి తోటరావు, ఓ. రాజు, జనపరెడ్డి కామేష్, ప్రసాదు, గణేష్, సాయి సేవకురాలు లక్ష్మి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.