Breaking News

శిథిలావస్థకు గురై మరమ్మత్తులకు నోచుకోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల.అంగన్వాడీ భవనం వద్ద విద్యా బోధన.

0 19


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

శిథిలావస్థకు గురై మరమ్మత్తులకు నోచుకోని తాటిమానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల.

సగం వరకు కట్టి వదిలేసిన అంగన్వాడీ నూతన భవనం వద్ద పాఠశాల విద్యార్థులకు విద్యాబోధన.

పాఠశాలకి లోపల వైపున  పైపెచ్చులు ఊడి పడుతుండడంతో తమ పిల్లలకు ఏ క్షణాన ఏమవుతుందోనని భయం గుప్పెట్లో తల్లిదండ్రులు.

వేరే అవకాశం లేక అంగన్వాడీ భవనం వద్దనే విద్యా బోధన చేయాల్సి వస్తుందని చెప్పిన పాఠశాల ఉపాధ్యాయులు.

అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా ఎవరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తాటిమనిపాలెం గ్రామస్తులు.

మొదట్లో ఈ పాఠశాల నాడు నేడులో మరమ్మతులు చేయించేందుకు లిస్టులో పేరు ఉందని చెప్పారని, తర్వాత మళ్లీ సెకండ్ లిస్ట్ లో పేరు లేదని చెప్పారని గ్రామస్తులు తెలిపారు.

ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం,అంతాడ పంచాయతీలోని తాటిమాని పాలెం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితి.

ఆ గ్రామంలో ఉన్న పాఠశాల ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లోపలి వైపున కారిపోతుందని అలాగే పైపెచ్చులు కూడా ఊడి పడుతున్నాయని, తమ పిల్లలకు ఏ క్షణాన ఏమవుతుందోనని భయపడి

ఆ గ్రామంలో అసంపూర్తిగా కట్టి వదిలేసిన అంగన్వాడీ భవనం వద్ద లోపల వైపున పిల్లలు కనీసం కూర్చోవడానికి వీలుగా ఉండే విధంగా గరుకు గచ్చైనా ఏర్పాటు చేయాలని…

తమ గ్రామానికి ఆనుకొని ఉన్న కాలువ వద్ద నుండి ఇసుకను తీసుకురావడం జరిగింది.

ఆ గ్రామంలో సుమారుగా 35 మంది వరకు చదువుకునే విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మరమ్మతులు చేయించాలని జిల్లా కలెక్టర్ ని ఐటిడిఏ పిఓని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.