Breaking News

సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వైద్య సేవా శిబిరం.

0 19

సత్య సాయి సేవా సంస్థలు విశాఖ జిల్లా ఉక్కునగరం సమితి మరియు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వారి సి.ఇ. ఆర్ నిధులతో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం,నల్లగొండ పంచాయతీలోని వై.ఎన్ పాకలు బాలికల ఆశ్రమ పాఠశాలలో

ఉచిత సమగ్ర వైద్య సేవ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

శ్రీ సత్య సాయి ట్రస్ట్ అల్లూరి జిల్లా అధ్యక్షులు గణేష్ మరియు మూర్తి సహకారంతో


సత్యసాయి ట్రస్ట్ కొయ్యూరు మండల కన్వీనర్ సెగ్గె సన్యాసిరావు,ఆర్. పరమేశ్, ఎం.శ్రీను, మల్లిబాబు, మూర్తి, రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని పలువురు తెలిపారు.

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ సెగ్గె సన్యాసిరావు తెలిపారు.

ఈ మెగా వైద్య శిబిరంలో కంటి జబ్బులు, ఎముకలు, కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, అన్ని రకములైన సాధారణ వ్యాధులు, నోరు, దంతవ్యాధులు, స్త్రీ సంబంధమైన వ్యాధులు, పిల్లల వ్యాధులు గురించి చూడటం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.