Breaking News

లేడీ కండక్టర్ ని సన్మానించిన జోనల్ ఈడి రవికుమార్.

0 20

పాడేరు

ఈనెల 14వ తేదీన పాడేరు నుండి జీకే వీధి వెళ్లే ఆర్టీసీ బస్సు పాడేరు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో బొక్కెల్లు వద్ద అనుకోకుండా ఉదయం 5:45 గంటల సమయంలో బస్సు టైర్ పంక్చర్ అయింది.

ఆ సమయంలో ఎవరో వచ్చి టైరు మార్చాలి అని ఆలోచించకుండా, ఆరోజు బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్.వి కుమారి వెంటనే పంక్చర్ అయిన టైరుని తీసి వేరే టైరు మార్చడం జరిగింది. 

ఈ మేరకు ఈ విషయం తెలుసుకున్న 6 జిల్లాల జోనల్ ఈడి రవికుమార్ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా లోని పాడేరు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని కండక్టర్ ఎల్.వి కుమారిని సాలువాతో సన్మానించి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.