Breaking News

సీఆర్టీల సమస్యలు పిఓ దృష్టికి.

0 19

పాడేరు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు 2022-23 విద్యా సంవత్సరానికి గాను రెన్యువల్ విషయమై ఈనెల 15వ తారీఖున పిఓ కి, కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చి సమస్యలపై పరిష్కార మార్గం చూపాలని విన్నవించుకున్నారు.


అప్పుడు ఈ విషయమై పరిష్కారం చేయకపోవడంతో ఈరోజు సిఆర్టి లు అందరూ పిఓ రోణంకి గోపాలకృష్ణ ని  కలిశారు.

కాళీ పోస్టులు భర్తీ చేసేందుకు సంబంధిత అధికారులతో చర్చించి 15 రోజులలో ఈ సమస్యను పరిష్కరిస్తానని పిఓ చెప్పినట్లు సి ఆర్ టి ల సంఘం ఉపాధ్యక్షులు డి.మోహన్ తెలిపారు.

ఈ సమావేశంలో సి ఆర్ టి లు ఓంకార్, రవి, జగన్, అమర్ పాత్రుడు, బాలు, రాంబాబు, రాధా, బుజ్జి ప్రియా, నాగరత్నం, మత్స్య కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.