Breaking News

బాదుడే బాదుడు కార్యక్రమం||అనంతరం నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 27

 వైసిపి మూడేళ్లు పాలనలో అరాచకాలు కక్ష సాధింపులే అభివృద్ధి శూన్యం

మైనింగ్ తవ్వకాలకు ప్రోత్సహిస్తున్నది వైసిపి ప్రభుత్వమే

వైసిపి మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

కొయ్యూరులో నిర్వహించిన టిడిపి నియోజకవర్గ స్థాయి సమావేశంలో గిడ్డి ఈశ్వరి.


అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం:

వైసిపి మూడేళ్ల పాలనలో అరాచకాలు కక్ష సాధింపులు తప్ప ఎక్కడ అభివృద్ధి అనే మాటే లేదని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. శనివారం కొయ్యూరు మండల కేంద్రంలో  నిర్వహించిన పాడేరు నియోజకవర్గం స్థాయి సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలో భారీ ర్యాలీతో బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించిన పాడేరు నియోజకవర్గం స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైసిపి మూడేళ్లు పరిపాలనలో ధరలు బాదుడు తప్ప ఎక్కడ అభివృద్ధి అనే మాటే కనబడలేదన్నారు. ఉప్పు నుండి పప్పు వరకు నూనె నుండి పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలవరకు బాదుడే బాదుడు చేస్తూ సామాన్యుడు కొని తినలేనంత ధరలు మోత మోగిస్తున్నారన్నారు. మైనింగ్ కి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అంటూనే మైనింగ్ కి ప్రోత్సహిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.ఈరోజు గిరిజన ప్రాంతంలో మైనింగ్ చేస్తున్నది వైసీపీ ప్రభుత్వమే అని ఈ మైనింగ్ శాఖకి జగన్మోహన్రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆమె అన్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే, ఉన్నటువంటి ఎలిమెంటరీ పాఠశాలలు మూడు నాలుగు ఐదు తరగతులు విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా ఆశ్రమ పాఠశాలల్లో విలీనం చేయడం ఎంతవరకు సమంజసంమన్నారు. ఉన్న పోస్ట్లు పోయే పరిస్థితి ఏర్పడుతుందని,ఈ రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందన్నారు.2024 ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీ గెలుపునకు ప్రతిఒక్కరు కృషిచేసి గతంలో వల్లే సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు నేరుగా చేరిందో అంతకంటే ఎక్కువగా అభివృద్ధి నోచుకోవడానికి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ఆమె ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల సీనియర్ నాయకులు మండల ప్రెసిడెంట్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.