Breaking News

కేసీఆర్ పై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి: మేడా శ్రీనివాస్ డిమాండ్

0 22

రాజమండ్రి:

కేసీఆర్ పై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి. 


కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన వేల కోట్లు కుంబకోణం నుండి ప్రజల ద్రుష్టి మళ్లించడానికే పోలవరం ఎత్తు అంటు కొత్త నాటకం. 

10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని రెవిన్యూ ను ఏపి ఖజానాలో జమచేయాలి. 

భద్రాచలం – దుమ్ముగూడెం రెవిన్యూ పరిధిని ఆంధ్రప్రదేశ్ లో కలపాలి. 

మోది జగన్నాటకంలో తెలంగాణా బిజెపి వెర్రి పుష్పాలుగా మిగులుతారు. 

మేడా శ్రీనివాస్, డిమాండ్, 

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ 

విభజన చట్టం పున సమీక్ష కై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 

ముందు ముందు తెలంగాణా ప్రజల సాక్షిగా శ్రీలంక అధ్యక్షుడును తరిమి నట్టు తెలంగాణా ప్రజలు కేసీఆర్ ను తెలంగాణా రాష్ట్రం నుండి తరిమి వేయటం ఖాయమని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ముసుగులో వేలకోట్లు కేసీఆర్ దోచుకున్నారని, తెలంగాణా ప్రజల సొమ్మును కేసీఆర్ సొంత ఖాతాలకు మళ్లించి తెలంగాణా ఆర్ధిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిపుణుల అంచనాలకు బిన్నంగా కేసీఆర్ స్వప్రయోజనం కోసం అధికార దుర్వినియోగం తో నిర్మించారని,

కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కొనసాగించటం అంటే తెలంగాణా రాష్ట్రం ను అమ్ము కోవడం వంటిదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయానికి 

పెద్ద పీట వేస్తాను అని తెలంగాణా రైతాంగాన్ని నమ్మించే దశగా ఖరీదైన భారి ప్రచారాన్ని సాగించి 

ఆ ముసుగులో నిధులను కైంకర్యం చేసారని,కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై సుప్రీం కోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తుకు అదేశిస్తే కేసీఆర్ జైలుకు వెళ్ళాక తప్పదని, తెలంగాణా ప్రజలుకు నిజాలు తెలియకుండా ఎప్పుడు ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోస్తు ఇరు రాష్ట్ర ప్రజల మధ్య అగ్గి రాజేయటం కేసీఆర్ కు తెలిసిన ఏకైక రాజకీయ కళ అని, గతం వలే కేసీఆర్ కుట్రలకు తెలంగాణా ఉద్యమ బిడ్డలు మోసపోరని, కేసీఆర్ అక్రమ సంపద కాంక్షకు తెలంగాణా అప్పుల ఊబిలోకి కూరుకు పోతుందని, విభజన అనంతరం కేసీఆర్ ధన దాహానికి తెలంగాణా లో అతి పేదరికం పెరిగిపోయిందని, పోడు రైతులు, ఉద్యమ వీరులు బిక్షం ఎత్తుకుంటున్నారని, తెలంగాణా లో కేసీఆర్ పాలనకు చమరగీతం పాడితేనే తెలంగాణా రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, శ్రీలంక అధ్యక్షులుకు పట్టిన గతే తెలంగాణా ప్రజల సాక్షిగా కేసీఆర్ తప్పదని ఆయన హెచ్చిరించారు.

10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హక్కు కొనసాగుతుందని, షెడ్యూల్ 9, 10 ప్రకారం 52 శాతం ఆంధ్రుల జనాభా, 48 శాతం తెలంగాణా జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పటి వరకు కేసీఆర్ దోచుకుంటున్న రెవిన్యూ వాటాను ఆంధ్రప్రదేశ్ ఖజానాకు బదలాయించే దమ్ము, నిజాయితీ కేసీఆర్ కు వుందా ! జనాభా దామాషా ప్రకారం ఆస్తులను,ఆర్ధిక రెవిన్యూ ను పంపకాలు చేసుకోమని సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిందని,ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రెవిన్యూ తో రాజభోగాలు అనుభవిస్తున్న కేసీఆర్, కేసీఆర్ పార్టి కి ప్రాతీయ ద్వేషాలు రెచ్చకొట్టడం తద్వారా సొంత ప్రయోజనాలకు మార్గం చేసుకోవటం పరిపాటిగా మారిందని,తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం తో బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దుతాను అని కేసీఆర్ డచ్ఛా మాటలకు తెలంగాణా ప్రజలు మోసపోయి నేడు కడు పేదరికాన్ని నెత్తి పై మోస్తున్నారని, కేసీఆర్ లో తెలంగాణా మట్టి పౌరుషం,నీతి నిజాయితి వుంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చకొట్టకుండా తెలంగాణా రాష్ట్రంను అభివృద్ధి దిశగా నడిపించాలని, కేసీఆర్ వైఖరి మార్చుకోక పొతే శ్రీలంక దేశ అధ్యక్షుడుకు పట్టిన గతే తెలంగాణా ప్రజలు చేత తరిమించుకు తీరుతారని ఆయన గుర్తు చేసారు. 

రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవిస్తే 1956 లో వున్న స్వరూపం ప్రకారమే రాష్ట్ర విభజనను కోరుకుంటాం అంతకు మించి ఒక్క అంగుళం కూడా మాకు వద్దు అని చెప్పుకున్న కేసీఆర్ 1956 లో భద్రాచలం రెవిన్యూ డివిజన్ ఏ భూభాగం లో వుందో కేసీఆర్ కు గుర్తు లేదా ! అని, రాష్ట్ర విభజన అనంతరం కూడా కేసీఆర్ మంత్రి పువ్వల అజయ్ కుమార్ తో 7 మండలాలను తిరిగి ఇచ్చేయండి అని ప్రకటన చేయించు కోవటానికి కేసీఆర్ సర్కార్ కు సిగ్గు వుండాలని, ఆనాడు ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి గల బలహీనతలు కారణంగా భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ వదులుకోవాల్సి వచ్చిందని, నేటికి 1లక్షా 50 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆస్తులను కేసీఆర్ సర్కార్ ఉచితంగా అనుభవిస్తుందని, ఇలా నిజాలు మాట్లాడితే ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య అగ్గి రాజేస్తు కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, తెలంగాణా ప్రజల్లో విశ్వసం కోల్పోతున్న కేసీఆర్ కు రాబోయే ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు, 7 విలీన మండలాలు ప్రధాన ఎజెండాగా మార్చుకుని ప్రజల మనోభావాలను రెచ్చగొట్టె రాజకీయ కుట్రలు రచిస్తున్నారని, కేసీఆర్ కుట్రలను తెలంగాణా ప్రజలు తిప్పికొట్టి ప్రజాస్వామ్యంను కాపాడుకోవాలని ఆయన కోరారు. 

పార్లమెంట్ బిల్లు ప్రకారం జరిగిన విభజనను కేసీఆర్ సర్కార్ ఉల్లంగిస్తుంది కాబట్టి విభజన చట్టం పున సమీక్షించాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో చర్చకు సిద్దపడి బిల్లు ప్రవేశ పెట్టటానికి కృషి చేయాలని, ప్రధాన అంశాలుగా హైదరాబాద్ లో గల ఆంధ్రప్రదేశ్ ఆస్తుల ఆదాయం ను ప్రత్యేక కమిటి ద్వారా నిర్ణయించి 

ఆ నగదును ఆంధ్ర ఖజానాకు బదలాయించాలని,

ఉమ్మడి రాజధాని గా ఉన్నటువంటి హైదరాబాద్ ఆదాయాన్ని షెడ్యూల్ 9, 10, ప్రకారం నేటి వరకు లెక్కకట్టి ఆంధ్రప్రదేశ్ కు జమచేయాలని, 1956 సంవత్సరం లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ విలీన స్వరూపం ప్రకారం అప్పటి భద్రాచలం రెవిన్యూ డివిజన్ ను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో కలపాలని, అశాస్త్రీయమైన వాదనలుతో పోలవరం ఎత్తు హెచ్చు తగ్గుల కోసం ప్రజల మనోభావాలను రెచ్చగొట్టె ప్రకటనలు చేయరాదని, విభజన చట్టం ప్రకారం అన్ని నిబంధనలు యుద్ద ప్రాతిప్రదికన అమలు చేసే అంశాలను క్రోడీకరిస్తు పార్లమెంట్ బిల్లుకు ఆంధ్ర ఎంపిలు పట్టు బట్టాలని, అందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలన్ని ప్రధాని నరేంద్ర మోదిని కోరాలని ఆయన పేర్కొన్నారు. 

పోలవరం ఎత్తు తగ్గింపు అని, 5 గ్రామాలను తెలంగాణాలో కలపమని, తెలంగాణా సర్కార్ అసందర్బ ప్రకటనలు చేయటం వెనుక బిజెపి రాజకీయ కుట్ర దాగి వుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన వేలకోట్ల అవినీతి కి సంబంధించి కేసీఆర్ ను అరెస్ట్ చేయక తప్పదని రహస్య సంకేతాల ద్వారా మోది, అమిత్ షా లు కేసీఆర్ ను భయపెడుతున్నారని, కేసీఆర్ మోదీని నేరుగా తిట్టడం కూడా బీహార్ ప్రశాంత్ కిషోర్ ఒప్పంద వ్యూహం లో భాగమని, 

ఏపి రీ ఆర్గనైజేషన్ యాక్టును, కేంద్ర టెక్నీకల్ ఎడ్వైజరి కమిటి సూచనలుకు బిన్నంగా పోలవరం ఎత్తు తగ్గింపులు కోసం అసందర్బ ప్రేలాపనలుకు కారణం కుట్రలో భాగం అని, వరద ముంపుకు పోలవరం ఎత్తు తగ్గింపుకు ముడి పెట్టి మాట్లాడుతున్న కేసీఆర్ అజ్ఞానానికి తార్కాణమని, తొలుత పోలవరం ప్రాజెక్ట్ ఏ విధమైన మార్పులకు అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించిందని, కేంద్ర జలవనరుల శాఖ 45.7 2, మీటర్లకు 55 వేల 656.8-7 కోట్లకు 

ది 21-5- 2009 న ఫైనల్ ఇస్టిమేషన్గా ఆమోదించిందని, 

ఆ తరువాత వ్యయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ 47, 725, 7-4 కోట్లకు కుదించిందని, 41.1-5 మీటర్లకు ఎత్తు తగ్గించుకోమని ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు సూచించిందని ఇది అంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై కేంద్రం కక్కుతున్న విషమేనని, నేడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై కక్కుతున్న విషంను కేసీఆర్ తో కక్కిస్తున్నారని,కేంద్రం కుట్రనే కేసీఆర్ అమలు చేస్తున్నారని, ప్రజలు దృష్టి మళ్లించటానికే కేసీఆర్ మోది పై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తు తెలంగాణా లో కాంగ్రెస్ శక్తి తగ్గించే విధంగా మోది అమిత్ షాలు కేసీఆర్ తో ఆడిస్తున్న నాటకం అని, తెలంగాణా లో కేసీఆర్, మోది, అమిత్ షా ల రాజకీయ క్రీడలో తెలంగాణా లో గల బిజెపి శాఖ వెర్రి పుష్పాలు గా మిగిలి పోతారని, కేసీఆర్ మోది అమిత్ షా లు ఆడిస్తున్న రాజకీయ రహస్య ఆపరేషన్ పేరే “క్లౌడు బస్టర్”అని కేసీఆర్ మత్తు పరజ్ఞానంలో ముంపు వరదలకు క్లౌడ్ బస్టర్ విదేశీ కుట్రగా పేర్కొంటు నోరు జారారని, ఈ క్లౌడ్ బస్టర్ ఆపరేషన్ తో రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం వుందని, కేసీఆర్ పట్ల, మోది (బిజెపి)పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రజలు అప్రమత్తంగా వుండాలని, తొందరపాటు ఆవేశాలకు లోను కావొద్దని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. 

ఈ సమావేశమునకు ఆర్పిసి నగర సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. 

ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, ఎండి హుస్సేన్, సిమ్మా దుర్గారావు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దోషి నిషాంత్మ, మట్టపర్తి తులసి, వల్లి శ్రీనివాసరావు, మాసా అప్పాయమ్మ, కోమర్తి గోపి శ్రీనివాసరావు, కోట పోతురాజు, కోట సుశీల, కోమర్తి గోపి శ్రీనివాసరావు, నాగూరి బాబీ, బోడపాటి పవన్, తాళ్లూరి మణికుమార్ పాల్గొని యున్నారు.

Leave A Reply

Your email address will not be published.