Breaking News

15వ రాష్ట్రపతి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ద్రౌపది ముర్ము కి చింతపల్లిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి శుభాభినందనలు తెలిపిన అఖిలపక్ష నేతలు.

0 22

 భారతదేశంలో అత్యున్నతమైన పదవి 15వ రాష్టపతిగా ఎన్నికై పదవి బాధ్యతలు స్పీకరించిన ఆదివాసీ ముద్దుబిడ్డ శ్రీమతి ద్రౌపతి ముర్ము గార్కి అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లిలో పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించి శుభాభినందనలు తెలిపిన అఖిల పక్ష ఆదివాసీ గిరిజన సంఘాలు,విద్యార్థిని విద్యార్థులు,శ్రేయోభిలాషులు.


భారతదేశ స్వాతంత్రం అనంతరం అగ్రవర్ణాల ఆధిపత్యం అధికంగా ఉన్న ఆ రోజుల్లో ప్రజాస్వామ్యభారతదేశ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛగా దేశ ప్రజలందరూ సమానంగా జీవించాలని డా,,బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరాజ్యాగంలో వెనకపబడిన వర్గాలకోసం కార్మిక కర్శకుల కోసం,స్త్రీలకు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆరోజు డా,, బీ.ఆర్.అంబేద్కర్ కృషి ఫలితమే ఈరోజు 15వ రాష్టపతిగా ఆదివాసీ ముద్దుబిడ్డ శ్రీమతి ద్రౌపతి ముర్ము గారు చేరుకొనటమే ఒక ఘనవిజయం అని ఆమెకు శుభాభినందనలు తెలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లిలో పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించిన అఖిల పక్ష ఆదివాసీ గిరిజన సంఘాల పెద్దలు,విద్యార్థిని విద్యార్థులు,శ్రేయోభిలాషులు.ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘ పెద్దలు మాట్లాడుతూ శ్రీమతి ద్రౌపతి ముర్ము గార్కి 15వ రాష్ట్రపతి స్థానం కల్పించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆదివాసీ హక్కులు GO No-3 వంటి ఆదివాసీ జీవాధారమైన హక్కులు అంతరించి పోతున్న సమయంలో ఆదివాసీ బిడ్డగా ముర్ము గారు రాష్ట్రపతిగా ఎన్నిక కాబడటం ఆనందిస్తున్నామని,ఆదివాసీ హక్కులను కాపాడే దిశగా దేశ ప్రజలకు సమన్యాయం చేసే దిశగా శ్రీమతి ద్రౌపతి ముర్ము పనిచేస్తారని ఆశభావం వ్యక్తపరిచారు.

Leave A Reply

Your email address will not be published.