Breaking News

మావోయిస్టులకు సహకరించి కష్టాలు కొని తెచ్చుకోవద్దు- మంప ఎస్సై లోకేష్ కుమార్.

0 24

 మావోయిస్టులకు సహకరించి కష్టాలు కొని తెచ్చుకోవద్దు-

 మంప ఎస్సై లోకేష్ కుమార్.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:

 మావోయిస్టులకు సహకరించడం మావోయిస్టు కార్యకలాపాలలో పాల్గొనడం చట్ట వ్యతిరేకమని  మంప ఎస్సై లోకేష్ కుమార్ పేర్కొన్నారు. గిరి గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మండలంలోని బూదరాళ్ల పంచాయతీ మారుమూల కునుకూరు పోకలపాలెం రాజులపాడు పోతవరం బొడ్డుమామిడి నల్లబెల్లి కన్నవరం  అన్నవరం గొర్రెలమెట్ట తదితర మారుమూల గ్రామాలను మంప ఎస్సై లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది సందర్శించి అక్కడి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యువత చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు రవాణా జోలికి పోవద్దని ఎస్సై హితబోధ చేశారు. నాటు సారా గంజాయి వంటి వాటికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మావోయిస్టులకు సహకరించడం మావోయిస్టు కార్యకలాపాలలో పాల్గొనడం చట్ట వ్యతిరేకం అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. సంఘవిద్రోహక శక్తులకు ఎవరు సహకరించిన కఠిన చర్యలు తప్పవని ఎస్సై లోకేష్ కుమార్  హెచ్చరించారు.  ప్రభుత్వం ద్వారా గిరిజనులకు గిరి రైతాంగానికి అందుతున్న సంక్షేమ పథకాల విషయమై గిరిజనులకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని, గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు వాణిజ్య పంటలపై దృష్టి సారించి గిరి రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.గిరిజనులకు ఏ కష్టం వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపడతామని వివరించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఆయా గ్రామాల గిరిజనులకు మెడికల్ కిట్లు, యువతకు వాలీబాల్ కిట్లను అందించడంతోపాటు పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.