Breaking News

ప్రమాదం జరిగేంత చేరువలో పాడేరు ఆర్టీసీ డిపో బస్సులు.పట్టింపులేని అధికారులు.

0 20

*ప్రమాదం జరిగేంత చేరువలో పాడేరు ఆర్టీసీ డిపో బస్సులు.

*పట్టింపులేని అధికారులు. 

*ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా అంటున్న ప్రయాణికులు.


అల్లూరి సీతారామరాజు జిల్లా లోని పాడేరు APSRTC డిపో పరిస్థితి రోజురోజుకి అధ్వానంగా తయారవుతుంది.ఈరోజు శనివారం మధ్యాహ్నం సుమారు 1:30 సమయంలో 22మంది ప్రయాణికులతో చింతపల్లి నుండి బాకూరు వెళుతున్న AP 31Z 0218 అను నెంబర్ గల ఆర్టీసీ బస్సు కిన్నెర్ల గ్రామం దాటి బ్రిడ్జి డౌన్ దిగి కొంచెం ముందుకు వెళ్లి వెనకాల చక్రానికి ఉన్న బోల్టులు పూర్తిగా అరిగి బస్సు డిస్క్ నుండి చక్రం బయటకు వేచ్చేసింది.

పాడేరు డిపోకు చెందిన బస్సులు ఇలా అవ్వటం ఇది మొదటిసారి కాదు.

 కనుక పాడేరు డిపో వర్క్ షాప్ లో ఎలాపనిచేస్తున్నారు.

డిపోలో బస్సుల మెయింటెనెన్స్ ఎలావుందో అర్ధమౌతుంది.

ఇలా పాడేరు ఆర్టీసీ డిపో బస్సులు ఈమధ్య ఏదో ఒక మూలన ఏదోవిదంగా బస్సులు మొరాయిస్తునే ఉన్నాయి.


ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో అధికంగా జరగటం చూస్తూనే ఉన్నాం.

ప్రయాణిలకు RTC బస్సులపై ఉన్న నమ్మకం పోయి ఎక్కాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ మధ్య పాడేరు నుండి అరకువేలీ వెళ్తున్న బస్సు పెద్దగరువు సమీపాన రన్నింగ్ లో వెనకాల చక్రం బొల్ట్స్ ఊడిపోయాయి.

మద్దిగరువు జి.మాడుగుల వెళ్లే బస్సు ఘాటీ దగ్గర గేర్ స్ట్రక్ అయి నిలిచిపోయింది.ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులలో మార్పు రావటం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

సరైన మెయింటెనెన్స్ లేని పాడేరు ఆర్టీసీ డిపో బస్సుల వల్ల ఏదో ఒకచోట అత్యంత ప్రమాదం జరిగి ప్రయాణికులకు ఏదో ఒకటి జరిగితేనే తప్ప అధికారులు స్పందించరేమో అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

కనుక ఇప్పటికైనా పాడేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులను సరైన మెయింటినెన్స్ చేసి, పర్యవేక్షణ చేసి ప్రయాణికులకు ఆరోగ్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.