Breaking News

ఆగస్ట్ 2 నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్ పిక్చర్ మార్చేయాలని ప్రధాని మోదీ పిలుపు.

0 23
Profile Picture: ఆగస్ట్ 2 నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్ పిక్చర్ మార్చేయాలని ప్రధాని మోదీ పిలుపు


న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా (Profile Picture) త్రివర్ణ పతాకాన్ని (Tri Colour Flag) ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ‘మన్ కీ బాత్’లో (Man Ki Baat) పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 15 వరకూ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో డీపీగా(డిస్‌ప్లే పిక్చర్)గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని సూచించారు. ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 15 వరకూ నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగ’లో (Har Ghar Tiranga) భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో (Azadi Ka Amrit Mahotsav) భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (75th anniversary of Independence) ఆగస్ట్ 15న (August 15) నిర్వహించకోనున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఆగస్ట్ 2న జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య (Pingali Venkayya) జయంతిని పురస్కరించుకుని ఆరోజు నుంచే సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ డ్రైవ్ ఆరంభించాలని ప్రధాని తెలిపారు.
Leave A Reply

Your email address will not be published.