Breaking News

మండల అధ్యక్షుడు జల్లి బాబులు ఆధ్వర్యంలో మండల కమిటీ.

0 20

 

మండల అధ్యక్షుడు జల్లి బాబులు ఆధ్వర్యంలో మండల కమిటీ.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన వైసిపి పార్టీ నేతల ఆధ్వర్యంలో గొలుగొండ మండలం కృష్ణా దేవి పేట

అల్లూరి స్మారక పార్కు వద్ద మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు తెలిపారు.

అలాగే జల్లి బాబులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు పాల్గొని కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలతో విజయవంతం చేశారు.

ఈ కమిటీ కార్యక్రమంలో భాగంగా కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేయాలని మండల అధ్యక్షుడు జల్లిబాబులు హితవు పలికారు.

గ్రామస్థాయిలో సమస్యలన్నీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా పని చేయాలని ఆయన అన్నారు.

ఎటువంటి భేదభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా వైయస్సార్ కుటుంబంలో పనిచేయాలని మరొకసారి పాడేరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేయాలని జల్లి బాబులు అన్నారు.

పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని వివరిస్తూ మండల అనుబంధ విభాగ కమిటీ మండల అధ్యక్షులు జల్లిబాబులు, ఎంపీపీ బడుగు రమేష్, జడ్పిటిసి వారా నూకరాజు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసలి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ కొప్పు రాజులమ్మ సర్పంచులు ఎంపీటీసీలు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.