Breaking News

రాజేంద్ర పాలెం పీహెచ్సీ లో ఆశా వర్కర్ల సమావేశం.బిజెపి ప్రభుత్వం పై సీఐటీయూ నాయకులు అప్పలనాయుడు మండిపాటు.

0 21

 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పి హెచ్ సి లో ఆశా వర్కర్స్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు వై.అప్పలనాయుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని,బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగస్టు ఒకటి నుండి 14వ తేదీ వరకు ప్రచారం చేయాలని సిఐటియు పిలుపునిచ్చిందని,ఈ పిలుపులో భాగంగానే ఈరోజు స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగవేయాలని,వారికే దేశం మీద భక్తి ఉన్నట్లని బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.ఆర్ఎస్ఎస్ గాని బిజెపి పార్టీ వారు గానీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని విమర్శించారు.

ఈరోజు దేశభక్తి ఉన్నదని చెప్పి తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని,ఈ రోజు దేశంలో నిత్యవసర వస్తువులు,పెట్రోలు, డీజిల్ మండిపోతున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు స్పందించలేదని అన్నారు.

 సామాన్యులు ఉపయోగించే పాలు, పెరుగు చిన్న చిన్న వస్తువుల పైన కూడా జీఎస్టీ దుర్మార్గమని అన్నారు.

 ఆర్ఎస్ఎస్ గాని బిజెపి పార్టీకి గాని దేశభక్తి గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వలన ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారని, నిరుద్యోగం పెరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కార్పొరేట్ సంస్థలైన ఆదాని, అంబానీ లాంటి వారికి కారు చవుగా అమ్మివేస్తున్నారని అన్నారు.

 కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక,రైతు ప్రజలందరూ విస్తృతంగా ప్రచారం చేయాలని, బిజెపి మతోన్మాది విధానాలను, కులాల మధ్య చిచ్చు పెడుతున్న కర్షకులకు, కార్మికులకు, ఉద్యోగులకు, విజ్ఞప్తి చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో ఎ.దేముడమ్మ,ఎల్.సరోజినీ,ఎం. సావిత్రి, ఎస్.నాగమణి, బి. రత్నకుమారి,ఎల్.నాగమణి,ఎస్. కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.