Breaking News

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో భూములు కోల్పోయిన గిరిజనులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు 180 రోజుల ఉపాధి హామీ పని దినాలు కల్పించాలి.-అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

0 18

 పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో భూములు కోల్పోయిన గిరిజనులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు 180 రోజుల ఉపాధి హామీ పని దినాలు కల్పించాలి.-అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

ఈరోజు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు అర్జున ముండా ని మర్యాద పూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.

ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో అత్యధిక గ్రామాలు గిరిజన గ్రామాలే ఉన్నందున,ఆ ప్రాంతంలో ఎవరైతే భూములు కోల్పోయిన గిరిజనులు ఉన్నారో వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు 180 రోజుల ఉపాధి హామీ పని దినాలు కల్పించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాఫీ సాగు ఎక్కువగా అరకు,పాడేరు నియోజవర్గాల గిరిజన కుటుంబాలే ఆధారపడి ఉన్నందున,ఇకపై నుండి ఉపాధి హామీ పథకంలో కాపీ సాగు చేర్చాలని డిమాండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

“ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా తల్లులకు అందజేస్తున్న”ఆర్థిక సహాయాన్ని మూడు దఫాలుగా కాకుండా,రెండు దఫాలుగా కుదించి అందజేస్తే,గిరిజన ప్రాంతంలో డెలివరీ అయిన గిరి మహిళలకు ఎంతో బాసటగా ఉంటుందని,దీనిపై దృష్టి సారించి త్వరితగతిన నిర్ణయం తీసుకొని గిరిజన ప్రాంతంలో అమలు చేయాలని గిరిజన మంత్రి ని కోరారు.

“అనంతపురం,చిత్తూరు,కడప,నెల్లూరు,ప్రకాశం,గుంటూరు,కృష్ణ జిల్లాలలో”ఐటిడిఏలు లేవని,ఈ ప్రాంతాల్లో ఐటిడిఏ నిర్మాణాలు చేపడితే,అయా ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలు,సులభతరంగా అందే విధంగా,వారి అభ్యున్నతికి దోహదపడే విధంగా ఉపయోగపడతాయని,కేంద్ర గిరిజన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.