Breaking News

మంప -పాడేరు ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్||తప్పిన ప్రమాదం||పూర్తిగా అరిగిన టైర్లు తోనే ప్రయాణం.

0 19

 

మంప- పాడేరు ఆర్టీసీ బస్సు కి తప్పిన పెను ప్రమాదం.

ఘాటీలో తిరిగే బస్సులకు ముందు వైపు సీల్ టైర్లు వేయకుండా, కనీసం ఏ మాత్రం బటన్ లేని టైర్లతో ప్రయాణం.

ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.

పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు పాడేరు నుండి మంప వెళుతూ రంపుల ఘాటీ మధ్యలో సుమారుగా 70మంది ప్రయాణికులతో 10 గంటల సమయంలో బస్సు ముందు నున్న టైరు పంక్చర్ అయింది.

డ్రైవర్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది.

టైరు మార్చేందుకు సరిపడా టూల్ కిట్ లేకపోవడంతో 

ఘాటీ కిందనున్న నడింపాలెం గ్రామానికి వెళ్లి పైపు తీసుకుని వచ్చి బోల్టులు తీసి వేరే టైర్ బిగించారు.

డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది కానీ లేదంటే భారీ ప్రమాదం జరిగేది.

అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే ఘటీలో తిరిగే బస్సులకు ముందున సీల్ టైర్లు వేయకుండా ఏమాత్రం బటన్ లేని పాత టైర్లతో వాహనాలు నడుపుతుండటం విశేషం.

అనేకసార్లు మీడియాలో వస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు అర్థమవుతుంది.

Leave A Reply

Your email address will not be published.