Breaking News

ఆదివాసీల పక్షాన ఉంటాం:హెచ్ఆర్ఎఫ్,ఆదివాసీ జెఏసీ,గిరిజనుల ఉద్యోగుల సంఘం.

0 21

 ఆదివాసీల పక్షాన ఉంటాం:హెచ్ఆర్ఎఫ్,ఆదివాసీ జెఏసీ,గిరిజనుల ఉద్యోగుల సంఘం.


అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం: ఆదివాసీల పక్షాన ఉంటామని మానవ హక్కుల వేదిక,ఆంద్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి,అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు అన్నారు.మండలంలో గొందిపాకలు పంచాయితీలో సర్పంచ్ సాగిన వరలక్ష్మీ,ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసిరాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు అధ్యక్షతన జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సమన్వయకర్త విఎస్ క్రిష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని రాజ్యాంగంలో పొందిపరిచిన చట్టాలైన 1/59,1/70 ఎల్టీఆర్ చట్టం,పీసా చట్టం,అటవీ హక్కుల చట్టం పరంగా ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసీల ఇష్టం లేకుండా ఎటువంటి ప్రాజెక్ట్ లు కట్టడానికి వీలులేదని అన్నారు.ఆంద్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి జిల్లా కన్వీనర్ రామరావుదొర మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోదుడు బోనంగి పండుపడాల్ స్వగ్రామంలో ఆదివాసీలు ఆదివాసీ హక్కులు,చట్టాల కోసం పోరాడుతున్నారు తప్పా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడంలేదని,ఈ ప్రాంతం లో నిర్మాణం చేయబోతున్న హైడ్రోపవర్ ప్రాజెక్ట్ కు వ్యతిరేఖంగా పీసా గ్రామసభలు ఏర్పాటు చేసి బాక్సైట్ తరహాలోనే అడ్డుకొంటామని అన్నారు.అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం వలన ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారని,పవర్ ప్రాజెక్ట్ ల వలన ఆదివాసీలకు నష్టాలే తప్పా,లాభాలు లేవని,పవర్ ప్రాజెక్టలలో ఉద్యోగులుగా ఆదివాసీలు కేవలం మూడు శాతం మాత్రమేనని, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మాట్లాడుతూ ఆదివాసీలకు వ్యతిరేఖంగా ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేసిన ఆదివాసీబిడ్డగా వారితో కలిసి పోరాడుతానన్నారు.ఈ కార్యక్రమంలో లోచెల రామక్రిష్ణ,బోయిపల్లి సింహాచలం,గంగారాజు,రామూర్తి నాయుడు,రాంబాబు,లక్ష్మీ పడాల్,కోటిబాబు,వీరభద్రరాజు,కుసలవుడు,కనకరావు,అబ్బాయి నాయుడు గొందిపాకలు పంచాయితీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.