Breaking News

వైసిపి లో భారీగా చేరికలు.

0 19

వైసీపీలోకి భారీ చేరికలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకులోయ మండలం.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ప్రవేశపెడుతున్న అనేకమైన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, టిడిపి మరియు తదితర ప్రతిపక్ష పార్టీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ.. పార్టీ జెండా నీడను ఆశ్రయిస్తున్నారని తెలియజేశారు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ.


నిర్జీవమైన పార్టీలలో మనుగడను కొనసాగిస్తూ, తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని, సజీవమైన సంక్షేమ ప్రభుత్వ పాలనకు సహకరించి రెండింతల సంక్షేమ అభివృద్ధికి గిరిజన ప్రజలంతా వారసులు కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే.

ఈ దశలో మండలంలోని మాదల పంచాయితీ పరిధికి చెందిన సుమారు 40 మంది టిడిపి నాయకులతో పాటు తదితర పార్టీల నాయకులు సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద, గిరిజన నేత అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకొని, వైసిపి జెండాను కప్పుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పాలనను మెచ్చి, వైసీపీని ఆశ్రయించిన నాయకులను సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే, తగిన సమయములో వారు తీసుకున్న నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు! వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుల, మతాలకు బేధాలకు ఏమాత్రం తావుండదని, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం తప్పకుండా దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు! రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పని చేద్దాం! సంక్షేమ ప్రభుత్వాన్ని పునర్నిర్మిద్దాం అని కార్యకర్తలకు ఉత్తేజపరిచారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గుణతో పాటు అరకులోయ వైసీపీ మండల అధ్యక్షులు కొర్రా గాసి, మాదల ఎంపీటీసీ స్వాభి రామ్ చందర్, పద్మా పురం సర్పంచ్ శ్రీమతి పెట్టేలి సుష్మిత, వార్డు సభ్యులు ఎల్బీ కిరణ్ కుమార్,వైసిపి సీనియర్ నాయకులు శెట్టి అప్పాలు, సమర్ది రఘునాథ్, MTR సాంబా, కొర్రా రామారావు, గరం పూర్ణ చందర్, కిల్లో సత్యానందం, స్వాభి రామ్మూర్తి, దురియా అప్పలస్వామి, శెట్టి గోపాల్, గురు మూర్తి(పాస్టర్), పాంగి నాగేశ్వరరావు, శెట్టి రామారావు, ఎస్. సోమేశ్ కుమార్,* మహిళా నాయకురాళ్లు: *కార్తీకో అరుణ కుమారి (ex ఎంపీపీ అరకులోయ), సమర్ది గులాబీ (ex సర్పంచ్ పెదలబుడు), మండి లక్ష్మీ, మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్ బురిడీ రామరాజు, తదితరులు పాల్గున్నారు.


Leave A Reply

Your email address will not be published.