Breaking News

హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వైసిపి నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు: మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

0 36

 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వైసిపి నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు


గొందిపాకల్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

అల్లూరి జిల్లా చింతపల్లి న్యూస్

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం గొందిపాకల పంచాయతీ కేంద్రంలో జేఏసీ నాయకులు నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవం కార్యక్రమానికి పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎర్రవరం గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాదం చేశాయని దీనికోసం వైసిపి ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు మాట్లాడకపోవడం ఏమిటని ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మీ వాటా ఎంత అని ఆమె ప్రశ్నించారు. గిరిజనుల హక్కులు చట్టలు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇటువంటి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ గిరిజన హక్కులు చట్టాలు భంగం కలిగిస్తున్నారని ఆమె మండిపడ్డారు.1/70 భూ బదలైంపు నిషేధ చట్టం పతిష్టంగా అమలు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఉద్యమానికి అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.