Breaking News

విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలి.

0 19

 విద్యాశాఖపై  సీఎం జగన్  సమీక్ష..

ఈ సందర్భంగా సీఎం  ఏమన్నారంటే..

నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలి

దీనికోసం ఎస్‌ఓపీలను రూపొందించాలి.

ఒక ప్రత్యేక అధికారికి స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించండి.

స్కూళ్లకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు నిర్వహించేలా విధానం ఉండాలి.

వచ్చే సమీక్షా సమావేశం నాటికి దీనికి సంబంధించిన విధి విధానాలు , ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలి.

అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలి.

అత్యుత్తమ బోధనకు ఇది దోహదపడుతుంది.

స్కూళ్లకు కాంపౌండ్‌ వాల్స్‌ తప్పనిసరిగా ఉండాలి..వీటిపై దృష్టిపెట్టాలి.

వచ్చే ఏడాది విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధంకావాలి.

ఏప్రిల్‌ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధంచేసుకోవాలి.

8వ తరగతి విద్యార్థులకు  అందించే ట్యాబ్‌ల కు టెండర్లు ఖరారుచేసి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలి.

తరగతి గదులలో  డిజిటలైజేషన్‌ లో భాగంగా స్మార్ట్‌ టీవీ లేదా ఇంటరాక్టివ్‌ టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధంచేయాలి.

పాఠ్యపుస్తకాలకు సంబంధించిన కంటెంట్‌ను అందరికీ అందుబాటులో పెట్టండి.

పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి.

దీనివల్ల లిబరల్‌గా అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి.

అంతేకాక ప్రభుత్వేతర స్కూళ్లు ఎవరైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆమేరకు వాటిని అందించండి.

ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాల కొరత అనేది ఉండకూడదు.

బాలికల భద్రతపై అవగాహన,రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలి.

గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా వీరిని కలిసి అవగాహన కల్పించాలి.

విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ ‌కోసం నియమించాలి.

Leave A Reply

Your email address will not be published.