అజాదీకా అమృత్ మహోత్సవంలో జాతీయ జెండాను సెల్యూట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నివాస గృహంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఆమె నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మూడు రోజుల పాటు పాడేరు నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన ఇంటి మీద నియమ,నిబంధనలని అనుసరించి మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేసి దేశంపై తమ బాధ్యతను, దేశభక్తిని చాటాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్ పాల్గొన్నారు.