Breaking News

విజయనగరంజిల్లాలో బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ కిసాన్ మోర్చా రాష్ట్ర,జిల్లా,నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.

0 17

 విజయనగరంజిల్లాలో బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ కిసాన్ మోర్చా రాష్ట్ర,జిల్లా,నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.


భారతదేశ స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తిచేసుకుంటున్న సుభతరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశ ప్రధానమంత్రి గౌ,,శ్రీ,,నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా అనే పిలుపుమేరకు 13-08-2022 తేదీనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంజిల్లాలో బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ కిసాన్ మోర్చా రాష్ట్ర,జిల్లా,నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.అనంతరం విజయనగరం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్,మరియు రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మరియు హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కన్వినర్ అర్జుల మురళీ కృష్ణ,ఉత్తరాంధ్ర కన్వినర్ పాకాలపాటి రవిరాజు మరియు విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డి.పావని మరియు 6 జిల్లాల కిసాన్ మోర్చా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఎగరావేశారు.


అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకలను ఇంత ఘనంగా ఇదివరకెప్పుడు జరుపుకోలేదని ఇంత మంచి అవకాశం దేశభక్తిని దేశ ప్రజలను ఒక్కటిగా చేసిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా భారతదేశ కీర్తిని,దేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలు గౌరవించేలా ఉందని నరేంద్ర మోదీ పరిపాలన చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా అభివృద్ధి ఉందని కొనియాడారు.జెండా పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు అని అన్నారు.అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా నుండి ఎంపీటీసీ గా గెలుపొందిన అరకు పార్లమెంట్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వంతల దేవదాసు కి రాష్ట్ర కార్యవర్గం ఘనంగా సన్మానం చేశారు. 

Leave A Reply

Your email address will not be published.