Breaking News

రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కొయ్యూరు సీఐ.

0 16

 రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కొయ్యూరు సీఐ.

కొయ్యూరు సీఐ ఏ.స్వామినాయుడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా అవార్డు, ప్రశంస పత్రం అందుకున్నారు. 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, సోమవారం పాడేరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ సతీష్ కుమార్, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ రోణంకి సమక్షంలో సీఐ ఏ.స్వామినాయుడుకు, మంత్రి అమర్నాథ్ ఈ అవార్డును అందజేశారు. 

స్వామి నాయుడు, కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించారు. 


సీఐగా బాధ్యతలను స్వీకరించిన ఈ కొద్ది కాలంలోనే స్వామి నాయుడు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ, 

ముఖ్యంగా ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న నాటుసారా, గంజాయి నిర్మూలనకు పాటు పడుతున్నారు. 

సీఐగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే మండలంలోని అన్ని గ్రామాల్లో, ముఖ్యంగా మారుమూల, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో సైతం పర్యటించారు. 

ఆయా గ్రామాల ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. 

నాటుసారా, గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చి, ప్రజల సహకారంతో, మండలంలో గంజాయి నిర్మూలనకు అన్ని విధాలా కృషి చేశారు. 

సర్కిల్ పరిధిలో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేశారు. గంజాయి రవాణా చేస్తున్న నిందితులను, ముఖ్యంగా పలువురు అంతరాష్ట్ర నిందితులను జైలుకు పంపించారు. 

గంజాయి నిర్మూలనకు సీఐ చేసిన కృషికి పోలీసు శాఖలో ఉత్తమ గుర్తింపు, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. 

గిరిజన యువతకు చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై, వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించి, 

వారిని చదువులోనూ, క్రీడల్లోనూ ప్రోత్సహిస్తూ, వాలీబాల్ కిట్లు తదితర క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు.

మారుమూల గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆయా గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించి, మండల ప్రజల మన్ననలను అందుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐ ఏ.స్వామినాయుడుకు అవార్డు రావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.