Breaking News

ఏబీవీపీ జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏబీవీపీ కమిటీ ఎన్నిక.

0 18

ఏబీవీపీ జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏబీవీపీ కమిటీ ఎన్నిక.


ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా G.మాడుగుల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాష్ట్రీయ కళామంచ్ కన్వీనర్ అధ్వర్యంలో నూతన కళాశాల కమిటీని ఎన్నుకోవడం జరిగింది… ఈ సందర్భంగా రాష్ట్రీయ కళామంచ్ కన్వీనర్ గమ్మెలి కళ్యాణ్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 లో ఢిల్లీ యూనిర్సిటీ లో కేవలం 5 మందితో మొదలయ్యి నేడు సంవత్సరానికి 50 లక్షల సభ్యత్వం తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఏకైక విద్యార్థి సంస్థ అని, విద్యార్థి పరిషత్ ఎన్నో ఉద్యమాలు చేసి అనేక విద్యారంగ సమస్యలను పరిష్కరించిందని, అదేవిధంగా సామాజికంగా కూడా ABVP ఎన్నో కార్య్రమాలను చేపట్టిందని, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్, స్టూడెంట్ ఫర్ సేవా, రాష్ట్రీయ కళామంచ్ లాంటి ఎన్నో విభాగాలు ABVP లో పని చేస్తున్నాయని, విద్యార్థుల కోసం, దేశం కోసం, దేశ అభివద్ధి కోసం ABVP నిరంతరం కృషి చేస్తూ ఉంటుందని అందులో విద్యార్థులు భాగం కావాలని పేర్కొన్నారు… అనంతరం ABVP కళాశాల కమిటీని ఎన్నుకోవడం జరిగింది… కళాశాల ఎబివిపి అధ్యక్షుడు గా నాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు… అదేవిధంగా కళాశాల కమిటి లో సూర్య, మహేష్, అశ్విని,నితిన్, రుక్మిణీ, దుర్గ,శైలజ, విఘ్నేశ్వరీ లు కమిటి సభ్యులుగా ఎన్నికవడం జరిగింది… ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా నాయకులు కిముడు నారాయణ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.