Breaking News

బిజెపి నేత దుక్కేరి ప్రభాకర్ రావు అధ్యక్షతన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

0 15

 బిజెపి నేత దుక్కేరి.ప్రభాకరరావు అధ్యక్షతన తన స్వగ్రామం సిగినాపల్లి రామ్ నగర్ కాలనీలో తమ గ్రామస్తులతో కలిసి భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని మరియు తమ గ్రామం నుండి అల్లూరి సీతారామరాజు గారితో స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య అనుచరుడిగా పనిచేసిన సంకోజీ ముక్కుడు స్వాతంత్ర సమరయోధుడిని గుర్తుచేసుకొంటూ ఘనంగా జరుపుకొన్న


ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు GPSTW స్కూల్ టీచర్ కామేష్ తో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి,పిల్లలు జాతీయ గీతాలు ఆలపించారు. తరువాత తమ గ్రామం నుండి అల్లూరి సీతారామరాజు తో స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య అనుచరుడిగా పనిచేసిన సంకోజీ ముక్కుడు స్వాతంత్ర సమరయోధుడిని గుర్తుచేసుకొంటూ గ్రామస్తులందరు ముక్యంగా గ్రామ యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు.


అనంతరం గ్రామంలో వృద్దులకు,పెద్దలకు సన్మానం చేసి వారి ఆశీర్వదాలను ప్రతి ఒక్కరూ తీసుకున్నారు.అయితే సిగినాపల్లి రామ్ నగర్ కాలనీ గ్రామానికి గొప్ప చరిత్ర కలిగిన స్వాతంత్ర్య సమరయోధులు పుట్టినా గ్రామానికి ఈరోజుకి ఈ గ్రామానికి తారోడ్డు లేదని,ప్రజలకు సరైన వసతి గృహాలు లేవని అభివృద్ధిలో మాత్రం చాలా వెనకబడిన గ్రామంగా మిగిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు.

అధికారులు మా గ్రామాన్ని గుర్తించి అభివృద్ధి చెయ్యాలని వారు కోరుతున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యులు పిల్లలు, ప్రజలతో పాటు దుక్కేరి.ప్రభాకారరావు జై ఆదివాసీ జై భీమ్ అధ్యక్షులు,&బీజేపీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మరియు GPSTW టీచర్ కామేష్,బీజేపీ సీనియర్ నాయకులు దుక్కేరి..జ్ఞానేశ్వరరావు,వైసీపీ నాయకులు సాగిన.సత్తిబాబు,బీజేపీ కిసాన్ మోర్చా కార్యదర్శి దుక్కేరి.శంకరరావు,బీజేపీ నాయకులు దుక్కేరి.బాబురావు,అంగన్వాడీ టీచర్ దుక్కేరి.రత్నాలమ్మ,గ్రామ పెద్దలు సంకోజీ.చంటిబాబు, సంకోజీ.నాగేశ్వరావు,సాగిన పెద్దబ్బాయి,దామనపల్లి పంచాయితీ ANM దుక్కేరి.శాంతికుమారి,వంతల.రాంబాబు,నిత్యావసర రైస్ బండి రధసారధి దుక్కేరి.రాజుబాబు,గ్రామ ఆశ వర్కర్ దుక్కేరి.లక్ష్మి తదితరులు కలిసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.