Breaking News

బాలారంలో ప్రభుత్వ ఆక్రమిత స్థల ఇనుప కంచె తొలగింపు.

0 14

 ప్రభుత్వ ఆక్రమిత స్థల ఇనుప కంచె తొలగింపు.


ఎన్నో రోజులుగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమి, స్మశానవాటికలో అక్రమంగా వేసిన ఇనుపకంచెను ఎట్టకేలకు బుధవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. వివరాల్లోకెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని బాలారం పంచాయతీ బాలారం గ్రామానికి చెందిన గిరిజనేతరుడు బండారు నూకి నాయుడు గ్రామానికి గల గడ్డవాగు ప్రాంతంలోని కొంత ప్రభుత్వ భూమిని అలాగే గ్రామస్తులందరికీ ఉపకరించే స్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించుకొని ఇనుపకంచె నిర్మించాడు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ విషయమై కొంతమంది గ్రామస్తులు కొయ్యూరు ఎమ్మార్వో తిరుమలరావుకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఎట్టకేలకు బుధవారం రెవెన్యూ శాఖ అధికారులు ఆర్ ఐ,వీఆర్వో, సర్వేయర్, వీఆర్ఏ సమక్షంలో  ఆక్రమిత స్థలంలో ఉన్న ఇనుపకంచెను తొలగించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.