Breaking News

ఎమ్మెల్యే పర్యటనలో టిడిపి కార్యకర్తలు.

0 17

ఎమ్మెల్యే పర్యటనలో టిడిపి కార్యకర్తలు.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బంగారం పేట పంచాయితీ లోని రైతు భరోసా కేంద్రం ప్రారంభించడానికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గురువారం హాజరైన నేపథ్యంలో అక్కడికి కొంతమంది టిడిపి కార్యకర్తలు ప్రత్యక్షమయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ నేతలు టిడిపి కార్యకర్తలను చూసి  అవాక్కయ్యారు.

కొంతమంది వైసీపీ నేతలు వారిని చూసి కొద్దిసేపు గుసగుసలాడుకున్నారు.

టిడిపి కార్యకర్తలు వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారా? లేదా ఎమ్మెల్యేతో ఏదైనా అవసరం నిమిత్తం వచ్చి ఉంటారా? అనే అంశాలు చర్చించుకున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శించే ప్రక్రియలో భాగంగా స్టేట్మెంట్ ఇచ్చిన నేతల్లో ఒకరైన టిడిపి కార్యకర్త గురువారం ఎమ్మెల్యే పర్యటనలో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఏదో ఉద్యోగ విషయమై ఎమ్మెల్యేను కలవడానికి వచ్చినట్లు కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.