Breaking News

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి,అధికారుల పర్యవేక్షణ లోపం,వింతవ్యాధులతో పసిపిల్లల ప్రాణాలు గాలిలో. వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి :మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్.

0 16

 ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి,అధికారుల పర్యవేక్షణ లోపం వింతవ్యాధులతో పసిపిల్లల ప్రాణాలు గాలిలో

వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి 

మృతి చెందిన పసిపిల్లల కుటుంబాలకు ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలి

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్.


అల్లూరి జిల్లా పాడేరు న్యూస్

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ గుర్రగరువు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత నెల రోజుల వ్యాధిలో ఇద్దరు ముగ్గురు చిన్నారులు చనిపోగా పలువురు పసిపిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎపిడమిక్ సీజన్ కావడంతో అధికార ప్రజాప్రతినిధులు అధికారులు అప్రమత్తమై గిరిజన ప్రాంతంలో ఎపిడెమిక్ సీజన్లో గతంలో చాలా మరణాలు సంభవించిన నిద్రమత్తులో ఉన్న వైసిపి పాలకులు అధికారులు మేలుకోకుండా ఏవైనా సంఘటనలు జరిగితే తప్ప స్పందించకపోవడం సిగ్గుచేటని, గిరిజనులు మరణిస్తే తప్ప అధికారులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. మోదపల్లి పంచాయితీ ఉన్నత స్థాయి వైద్య అధికారులు పర్యటించి ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి అనారోగ్యానికి పాలైన పసి పిల్లలను వెంటనే మెరుగైన వైద్యం అందించి చనిపోయిన పసిపిల్లల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేసి గిరిజన ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు పునరువృతం కాకుండా చేయాలని ఆమె ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.