Breaking News

విద్యా సంస్థల్లో విద్యార్థి, ప్రజా సంఘాలను అనుమతి లేదని తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చెయ్యాలి: ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్.

0 15

 విద్యా సంస్థల్లో విద్యార్థి, ప్రజా సంఘాలను అనుమతి లేదని తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చెయ్యాలి: ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్ .


ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాడేరు శాఖ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్ మాట్లాడుతూ గిరిజన పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థి, ప్రజాసంఘాలు అనుమతి లేదని తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలనీ అయన డిమాండ్ చేసారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులను గిరిజన పాఠశాలలో, కళాశాలలో వెళ్లకుండా ఎలా నియంత్రిస్తారని విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమై విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి, ప్రజాసంఘాలను అనుమతించకుండా విద్యార్థుల సమస్యలు విద్యార్థుల నుండి తెలుసుకోలేని విధంగా తీసుకొచ్చిన జీవో గిరిజన పాఠశాలలో, కళాశాలలో సమస్యలు సమస్యల నిలయంగా మారే అవకాశం ఉందన్నారు.ఇటువంటి జీవోలు తీసుకొచ్చి విద్యార్థుల సమస్యలు చెప్పుకోలేని విధంగా విద్యార్థుల గొంతు నొక్కే విధంగా తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలనీ అయన డిమాండ్ చేసారు.లేనిచో విద్యార్థి, ప్రజాసంఘాలు ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్రీయ కళమంచ్ విభాగ్ కన్వీనర్ గెమ్మెలి కళ్యాణ్, నగర కార్యవర్గ సభ్యుడు బిసాయి కామరాజు, డిగ్రీ కళాశాల అధ్యక్షులు కిముడు మల్లేష్, హుకుంపేట మండల కన్వీనర్ సీసా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.