Breaking News

ఢిల్లీ బ‌య‌లుదేరిన సిఎం జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి. రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తిని క‌లిసే అవ‌కాశం.

0 16

 ఢిల్లీ బ‌య‌లుదేరిన సిఎం జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి.

 రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తిని క‌లిసే అవ‌కాశం.



గ‌న్న‌వ‌రం నుంచి బ‌య‌లుదేరిన ఎపి సిఎం.

రాత్రికి ఢిల్లీలోనే సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి బ‌స‌.

రేపు ఉద‌యం ప్ర‌ధానితో భేటీ కానున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదివారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. 

విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ రాత్రికే ఢిల్లీ చేరుకోనున్న జ‌గ‌న్‌… రాత్రి ఢిల్లీలోనే బ‌స చేస్తారు. 

సోమ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అవుతారు. 

ప్ర‌ధానితో భేటీ త‌ర్వాత రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్‌ల‌తోనూ జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.