Breaking News

నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి గా చేసుకుంటేనే మన బతుకులు బాగుపడతాయ్.బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 15

 నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి గా చేసుకుంటేనే మన బతుకులు బాగుపడతాయ్

ఇంటి వద్దకి బియ్యం సరే..మరి నిత్యావసర వస్తువులో…

తోటల గొంది, మోదపల్లి గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.


అల్లూరి జిల్లా పాడేరు న్యూస్:

రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటి వద్దకే బియ్యం, నిత్యావసర వస్తువులు అందిస్తామని గొప్పలు చెప్పుకున్న వైసిపి ప్రభుత్వం నేడు బియ్యం ఇస్తూ నిత్యావసర వస్తువులు మరిచారని పాడేరు మండలం కించూరు పంచాయతీ తోటలు గొంది గ్రామం మోదపల్లి పంచాయతీ మోదపల్లి గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో గిడ్డి ఈశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉప్పు నుండి పప్పు వరకు నూనె నుండి పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరల వరకు బాదుడే బాదుడు చేస్తూ ప్రజల నడ్డి వైసిపి ప్రభుత్వం విరుస్తుందని అన్నారు. ఏ ప్రాంతానికి చూసుకున్న గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులే ఉన్నాయి తప్ప వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి మూడున్నర సంవత్సరాలు ఎక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు పూర్తి చేసిన వారికి రుణాలు ఇవ్వకుండా పూర్తి చేయని సంఘాలకు రుణాలు మంజూరు చేశారని ఆమె ఎద్దేవా చేశారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టి ఆ హామీలు గాల్లో వదిలేసారని అన్నారు.


గతంలో ఒక కుటుంబం నెలకు 11వేల రూపాయలు సరిపోలేదని నేడు అన్నిటికీ ధరలు పెంచేసి సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితిలో నేడు ఒక కుటుంబానికి నెలకు 20వేల నుండి 25 వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని అన్నారు. నేడు సామాన్యుడు బ్రతకాలంటేనే బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి గా చేసుకుంటేనే మన బ్రతుకులు బాగుపడతాయని, లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందోనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి గా చేసుకోవాలని కార్యకర్తలకు ప్రజలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బడ సింహాచలం, బుక్క జగదీష్, శోభన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.