Breaking News

వాగులో కొట్టుకుపోయిన గ్రామ వాలంటీర్ ద్విచక్ర వాహనం.

0 17

 వాగులో కొట్టుకుపోయిన గ్రామ వాలంటీర్ ద్విచక్ర వాహనం.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

 ఈరోజు గొంది కోట వాలంటీర్ కొర్ర ఆదినారాయణ యు.చీడిపాలెం సచివాలయానికి వెళ్లి విధులు ముగించుకుని వస్తున్న మార్గంలో గొట్టలపాడు వాగు దాటుతుండగా ఈరోజు కురిసిన అతిపెద్ద వర్షానికి అకస్మాత్తుగా వరద ఉధృతి పెరిగి తన హోండా లివో బైక్ కొట్టుకుపోయింది. వాలంటీర్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. గత సంవత్సరం ఇదే వాగు దాటుతుండగా అంగన్వాడి కార్యకర్త భర్త బైక్ మరియు నీలవరం గ్రామ నివాసి పంప మంగ్లా కొట్టుకుపోయారు.బైకు దొరికినప్పటికీ మనిషి శవం ఇప్పటికీ దొరకలేదు. ఈ వాగు పై బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థానిక సర్పంచ్ చొరవతో ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నిధులు మంజూరై సంవత్సరం గడిచినప్పటికీ ఇంకా నిర్మాణ పనులు చేపట్టలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే దాదాపుగా 15 గ్రామాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది.కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి వెంటనే నిర్మాణ పనులు చేపట్టుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా యూ.చీడిపాలెం సర్పంచ్ దడాల రమేష్ కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.