Breaking News

కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనని అడ్డుకోవడం నీకు తగునా.-పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

0 15

 కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనని అడ్డుకోవడం నీకు తగునా.

కుప్పంలో అన్న క్యాంటీన్ పై దాడి హేయమైన చర్య.

సీఎం దర్శకత్వంలోనే కుప్పంలో వైసీపీ శ్రేణుల ధ్వంసం.

-పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

గిడ్డి ఈశ్వరి (మాజీ ఎమ్మెల్యే).

అల్లూరి జిల్లా పాడేరు న్యూస్:

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్టకు చేరి కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటన అడ్డుకుంటున్నారని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గురువారం స్థానిక విలేకరులకు ఒక ప్రకటనలో ఆమె అన్నారు.ఆ ప్రకటనలో ఆమె మాట్లాడుతూ కుప్పంలో అన్న క్యాంటీన్ పై దాడి హేయమైన చర్యఅని,కుప్పంలో అన్న క్యాంటీన్ పై దాడిని ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబును కుప్పంలో తిరగకుండా చేసేందుకు ప్రయత్నం చేయడం నీకు తగునా.. చంద్రబాబు నాయుడు ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. సీఎం దర్శకత్వంలోనే కుప్పంలో వైసీపీ శ్రేణులు అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశారని,కుప్పంలో శాంతిభద్రతలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని, కుప్పం ఘటనకు వైసిపి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.కుప్పంలో వైసీపీ శ్రేణులను పోలీసులు నియంత్రించాలని,ఏపీలో టీడీపీ లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నా టీడీపీ తిప్పికొడుతోందని, 175 స్థానాలకు 175 టీడీపీ గెలవబోతుందన్నారు. అందుకే సీఎం జగన్ కు పిచ్చి పట్టిందన్నారు. చంద్రబాబును కుప్పంలో తిరగకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే జగన్ పాదయాత్ర చేసేవాడా?అని ప్రశ్నించారు. సీఎంకు పిచ్చి పరాకాష్టకు చేరి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారు అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.