Breaking News

సుకుమా జిల్లా: అటవీ ప్రాంతంలో ప్రజా కోర్టు నిర్వహించిన మావోయిస్టులు.

0 19

 ఆంధ్ర- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సుకుమా జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించారు.  


ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కేడర్‌ను ఈ ప్రజా కోర్టులో హాజరుపరిచారు. 

 ఈ ప్రజా కోర్టులో మావోయిస్టులు అధునాతన ఆయుధాలతో దట్టమైన అడవిలో సమావేశమయ్యారు.  

ఈ సమావేశంలో మావోయిస్టు మిలిషియా సభ్యులు, కార్యకర్తలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.  

 కొద్ది రోజుల క్రితం శబరి ఏరియా మావోయిస్టు కమిటీకి చెందిన జీవన్.. మావోయిస్టు పార్టీని విడిచిపెట్టి మహిళా మావోయిస్టు గంగి తో సుకుమా పోలీసులకు లొంగిపోయాడు. 

 కిస్టారం అడవుల్లో నిర్వహించిన ప్రజా కోర్టులో జీవన్ డబ్బు కోసం పార్టీని వీడి గంగిని పెళ్లి చేసుకున్నాడని మావోయిస్టులు ఆరోపించారు.  

కొన్ని రోజుల తర్వాత, మావోయిస్టులు అతన్ని అపహరించి ప్రజా కోర్టులో హాజరుపరిచారు. 

 పోలీసులు ఇచ్చే డబ్బుకు ఆశపడి, జీవన్ మావోయిస్టు పార్టీకి పనిచేసే మిలిషియా సభ్యులను, పార్టీ కార్యకర్తలని లొంగి పొమ్మని ఒత్తిడి తీసుకొస్తున్నాడని, లొంగిపోయిన వారికి మావోయిస్టుల సమాచారం.. పోలీస్ ఏజెంట్గా మారితేనే సరెండర్ డబ్బులు ఇస్తామని.. పోలీసులు బెదిరిస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు.

  చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజా కోర్టులో ప్రజల ముందు జీవన్ తాను చేసిన తప్పుని అంగీకరించారు. 

దీంతో మావోయిస్టులు మొదటి తప్పుగా క్షమించి విడిచిపెట్టినట్లు జీవన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.